Sunday, 11 November 2012

నీ ప్రేమ తుఫాను

‘ప్రేమ కవిత’ టాగుతో ఉన్న టపాలు
నీ ప్రేమ తుఫాను

ఊహలకు రూపమై మరిపిస్తే..అది నువ్వు నా ప్రేమ
అంతలా ఏముందో  నీలో
జడివానలో తుఫానువై నా వెలుగును కప్పేసి  కమ్ముకున్న
దట్టమైన ప్రేమామృత కారు మేఘం నువ్వు
తీరం దొరకక మునుగుతూ తేలుతూ నీ ఆలోచనలో పూర్తిగా చావనీదు..ఊపిరి ఆడనీదు..ఆ ప్రవాహం
కొత్త మాయలో నీ తలపుల సుడిలో గిర్రున నా హృదయం
ఏ అర్ధరాత్రో నిను చూడాలి అని ఆవేశ పడిపోతుంది
అంతరాన్ని కరిగించలేని  నిస్సహాయుడినై  కలల ప్రయాణం తిరిగి  మొదలు పెడుతా
నీ పరిచయంలో నాకు  ఏది పాతదైపోలేదు
రోజు రోజుకు నువ్వు నీ ఆలోచనలు కొత్త కొత్త గా
పురివిప్పి నను మరో లోకంలోకి నడిపిస్తున్నాయి
చుక్కానివై ఈ జీవితాన్ని నడిపిస్తావని అచెంచల విశ్వాసం కాబోలు
ఏమో ఎక్కడికో అని నేను అడగను
మన  హృదయాలకి ఏదో లంకె వేశాడు వాడు….నాకు చేరు వైన కొద్ది
నాలో గుండె వేగం ఉప్పొంగిపోతోంది
నా కళ్ళు కనిపించే కొన్ని ఘడియలు నిను తడిమేస్తున్నాయి
మాటలకందని భావంలో  లోలోపల నేను మురిసిపోతాను
ఎలా చెప్పాలి  నువ్వు నా అందమైన గమ్యమని..ప్రాణమని
ప్రేమిస్తున్నా…
వ్యక్తపరిస్తే నను ఎలా చూస్తావో అని నాకు నేనే ప్రశ్నగా మిగిలిపోయా
నెగ్గగలను అని నీ చూపు భరోసా ఇస్తున్నా..
నా సమాధానాల భారం మోయలేక చతికల పడుతా

Thanks:Net

No comments:

Post a Comment